దానా తుపానుకు ఒడిశాలోని అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భద్రక్ జిల్లా బసుదేవ్‌పూర్ బ్లాక్‌లో ప్రజలు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లేక, తమ వారితో మాట్లాడే సదుపాయం లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌కు గంటకు రూ.20 చొప్పున, ఇంటిపైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులపైకి నీటిని తరలించేందుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.