వేయించిన ఆహార పదార్థాలు అతిగా తినకూడదని అంటారు. కానీ కొన్నింటిని వేయించి లేదా కాల్చి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేయించిన బాదంపప్పు మెదడుని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. కాల్చిన చిలగడదుంపలోని బీటా కెరోటిన్ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. బ్రొకలీలో ఉండే విటమిన్-కె, వాల్‌నట్స్‌లోని ఒమేగా-3, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను కాపాడతాయి.