మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 4వ తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.