AP: విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను ఈరోజు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులపై కేంద్రం చాలా సీరియస్గా ఉందన్నారు. ఆ విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఏవియేషన్ చట్టాల్లో సవరణలు చేస్తామని.. ప్రధాని మోదీ ఆ విషయంలో తమకు ప్రత్యేక సూచనలు చేశారని పేర్కొన్నారు.