TG: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి హరియాణా వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. కిషన్ గూడ ట్రంపెట్ వంతెన వద్ద ఓ కారు సడన్ గా కాన్వాయ్‌లోకి వచ్చింది. దీంతో కాన్వాయ్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దత్తత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నారు.