ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని సౌదీ అరేబియాలో నిర్మిస్తున్నారు. సౌదీ రాజధాని రియాద్‌లోని కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో ‘ది ముకాబ్’ పేరుతో దీని నిర్మాణం చేపట్టారు. రూ.4.20లక్షల కోట్ల వ్యయంతో 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో క్యూబ్ ఆకారంలో ఈ భవనం ఉండనుంది. ఈ బిల్డింగ్ లోపల గోడలకు అత్యాధునిక వర్చువల్ రియాలిటీతో పాటు భారీ హోలోగ్రామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి దీని నిర్మాణం పూర్తికానున్నట్లు సమాచారం.