ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓటర్లకు 1 మిలియన్ డాలర్లు పంపిణీ చేస్తాననే ప్రకటనపై నమోదైన పెన్సిల్వేనియా దావాను ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలని మస్క్ విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు. ఎంపికైన 14 మంది ఓటర్లకు 1 మిలియన్ డాలర్లు పంచుతామని మస్క్‌కు చెందిన అమెరికన్ ప్యాక్ ప్రటించడంతో ఈ కేసు నమోదైంది. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.