యూపీలోని అయోధ్య, బీహార్లోని సీతామర్హి మధ్య కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. నర్కాటియాగంజ్-రాక్సౌల్- సీతామర్హి (పునౌరా ధామ్) – ధర్భంగ, సీతామర్హి- ముజఫర్ పూర్ సెక్షన్ల మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.