TG: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, BRS నాయకులపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టడాన్ని మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు X వేదికగా ప్రకటన చేశారు. పేదల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసులు BRSకి కొత్తేం కాదన్నారు. వెంటనే అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.