AP: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి 84,297 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే బ్యారేజీలో 3.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది.