AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల ట్వీట్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించినట్లు ఆధారలుంటే అంబటి చూపించాలన్నారు. అధినేత మెప్పుకోసం అంబటి పదేపదే అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయని అంబటికి తెలియదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని సాంకేతిక సలహా మేరకు ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పోలవరంపై మాకు వందశాతం చిత్తశుద్ధి ఉందిని పేర్కొన్నారు.