రాజస్థాన్ అజ్మీర్‌లోని అనసాగర్ ఖోబ్రనాథ్ భైరవ్ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ మొక్కులు చెల్లించిన వారి కోరిక తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. నిత్యం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఆదివారం ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారు తమ కోరికలను లేఖలో రాసి బాబాకు సమర్పించినట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని చెబుతారు. పెళ్లికాని అబ్బాయి, అమ్మాయి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం.