AP: పల్నాడు జిల్లాలో అతిసారంపై కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో అతిసారంతో ఇద్దరు మృతి చెందడంపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వ చర్యలను సీఎంకు కలెక్టర్ వివరించారు. సాధారణ స్థితి వచ్చే వరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్సతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.