ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై గాలంట్ స్పందించారు. ఇజ్రాయెల్ భద్రతనే తన జీవిత లక్ష్యమని తెలిపారు. IDF, భద్రతా స్థాపన తర్వాతనే తన వ్యక్తిగత భవిష్యత్తు అని భావించానని వెల్లడించారు. దాదాపు 50 ఏళ్లుగా ప్రజాసేవలో స్థిరంగా, క్లారిటీగా ఉన్నానని పేర్కొన్నారు.