AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం ముగిసిన అనంతరం హస్తినాకు బయలు దేరనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాన్ ఇటీవల హోంమంత్రి తీరుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంతో తాజాగా ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొన్నది. మంత్రివర్గం మార్పు అంశంపైనే చర్చలు జరిపేందుకు వెళుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.