AP: పల్నాడు కరువు కష్టాలు తీరడానికి వరికపూడిశెల పూర్తి కీలకమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గోదావరి జలాలు సాగర్ కుడి కాలువలో కలపడమే కరవుకు పరిష్కారం అని తెలిపారు. సీఎం, ప్రధాని భేటీలోనూ నదుల అనుసంధానంపై చర్చలు జరిగాయన్నారు. నదుల అనుసంధానానికి నిధులపై కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. పల్నాడును సస్యశ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.