డిజిటల్ అరెస్ట్‌లపై ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. ఫోన్ చేసి తాము రిజర్వ్ బ్యాంక్ అధికారులమని, సీబీఐ అని, పోలీసులమని చెప్పి బెదిరించే మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ యూనిఫాం ధరించి వీడియోలో అవతలి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అలాంటి వారిని వెంటనే ఆ కాల్‌ను కట్ చేసి నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి డయల్ చేయాలని సూచించారు.