AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘పవన్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. దాంట్లో కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతా’ అని పేర్కొన్నారు.