AP: TTD బోర్డ్ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్నఅన్యమతస్తులను వీఆర్ఎస్ ద్వారా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని బాధ్యతలు చేపట్టకముందే నాయుడు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. TTD ఏమైనా మీ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యమతస్తులకు ఎందుకు చోటు కల్పిస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు.