AP: అమరావతిలో టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.