త్వరలో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నియమితులయ్యారు. ఎన్నికల్లో ధోనీ ఫొటోను వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ ప్రకటన చేశారు.