ప్రముఖ సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి మరణించారంటూ వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. తప్పుడు వార్తలతో అభిమానులను తప్పుదోవ పట్టించొద్దని కోరారు. ఇందిరా భాదురికి ఏమీ కాలేదని.. ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని చెప్పారు. కచ్చితమైన సమాచారం వచ్చిన తర్వాతే వార్తలు ప్రచారం చేయాలని కోరారు.