AP: వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవలరంగంలో వృద్ధిపై సచివాలయంలో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి పీ4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామని ప్రకటించారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు.. ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.