AP: వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని జగన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని నారాయణకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపురి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. కాగా తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ జగన్పై 2018లో నారాయణ పరువునష్టం దావా దాఖలు చేశారు.