TG: గతంలో మూసీకి భారీ వరదలు వచ్చాయని హైడ్రా అధికారి దానకిషోర్ అన్నారు. వరదలతో ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను ముంపు నుంచి కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారని గుర్తుచేశారు. చెరువులు, కుంటల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. కుచించుకుపోయిన మూసీ నదిని విస్తరించడమే తమ లక్ష్యం అన్నారు.