TG: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయంపై చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణనకు చర్యలు తీసుకున్నామని కేసీకి భట్టి వెల్లడించారు. హామీల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు.