TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దండుపాళ్యం నాయకుడు కేటీఆర్ అని.. దండుపాళ్యం బ్యాచ్‌లా బీఆర్ఎస్ మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పైకొచ్చిన నాయకుడని, కిందిస్థాయి ప్రజల బాధలు రేవంత్‌కు తెలుసన్నారు. రేవంత్ తిట్లకు కేసీఆర్ తట్టుకోలేడని, కేటీఆర్ నాజూకు లీడర్ అని ఎద్దేవా చేశారు.