TG: ఇసుక దందాపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీమంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. గత పదేళ్లలో ఇసుక దందా ఎవరు చేశారో తెలుస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్పై తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని తెలిపారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని వ్యాపారులు నమ్మవద్దని మంత్రి సూచించారు.