TG: బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. వారిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిపింది. కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక.. ప్రభుత్వ వ్యతిరేఖ శక్తుల హస్తముందని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదని హెచ్చరించింది. సెలవులపై పాతపద్ధతినే అనుసరిస్తామని చెప్పినప్పటికీ.. ఆందోళనలు చేయడం సరికాదని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.