AP: వైసీసీ హయాంలో నిలిపివేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. వారం రోజుల్లో దేహదారుఢ్య, శారీరక కొలతలకు దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామన్నారు. దీనిలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబరులో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.