TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున లాయర్లు వాదనలు వినిపించనున్నారు. BRS ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణకు షెడ్యుల్ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే. శ్రీనివాసరావు ధర్మాసనం ఈరోజు విచారణ జరపనుంది.