అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ‘మార్ ఆ లాగో’ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ట్రంప్ గెలిచిన తర్వాత అభిమానులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు ట్రంప్ మార్ ఆ లాగో రిసార్టుకు రానున్నారు. దీంతో అక్కడి పరిసరాలన్నీ రిపబ్లికన్లతో నిండిపోయాయి. కాగా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోయిన తర్వాత.. తన శాశ్వత నివాసమైన ‘మార్ ఆ లాగో ఎస్టేట్’లో ఎక్కువగా గడిపారు. ఇది 20 ఎకరాల్లో విస్తరించి ఉంది.