NDL: బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీలో మురుగునీరు నిల్వ ఉంది. దీంతో రోగాలు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువైందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.