హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల్లో BJPని ఓడించాలని పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పంటల కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అలాగే పలు డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 3న దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. BJP దురాగతాలకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరాయి.