టెక్ సంస్థల్లో లేఆఫ్స్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. 2022లో సామాజిక మాద్యమం ఎక్స్‌లో ఉద్యోగాలకు భారీగా కోతపెట్టారు. తాజాగా ఇంజనీరింగ్ వింగ్ ఎంప్లాయిస్‌కు పెద్దమొత్తంలో ఎక్స్ లేఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై యాజమాన్యం బహిరంగంగా స్పందించలేదు. గతంలో ఎక్స్ సంస్థ 6వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 80శాతం మందిని తొలిగించింది.