ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్లో ఇరాన్ కీలక నేతలను అంతమొందించాలని చర్చ జరిగిందని, ఆ జాబితాలో అయాతుల్లా ఖమేనీతోపాటు కీలక కమాండర్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్ హిట్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వారిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు సమాచారం. అలాగే, ఆ దేశ రక్షణమంత్రి యోవ్ గాలంట్, ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండర్లు ఉన్నారని తెలుస్తోంది.