‘ఆర్జీ కర్’ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో గుర్తుతెలియని వ్యక్తులు కశ్మీర్‌ను ప్రస్తావిస్తూ దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.