TG: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ భాగ్యలక్షీ అమ్మవారి ఆలయాన్ని అయోధ్య ఆలయ నమూనాలో అలంకరించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతం నేడు మరింత ఆహ్లాదకంరంగా కనిపిస్తోందన్నారు. చార్మినార్కు వచ్చిన సందర్శకులు ఈ ఆలయ అలంకరణ చూసి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.