TG: R&B, ఫారెస్ట్ అధికారులతో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అటవీ అనుమతులు లేక ఆగిపోయిన రోడ్ల నిర్మాణాలపై విస్తృతంగా చర్చించారు. అటవీ అనుమతులు లేక దాదాపు 91 పనులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీ అనుమతుల కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఇరుశాఖల అధికారులను మంత్రులు సూచించారు. రోడ్ల నిర్మాణం ఆలస్యం అయితే అభివృద్ధి కుంటు పడుతుందని కోమటిరెడ్డి వెల్లడించారు.