కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే ఓ టెండర్ ఓకే అయిందని..రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు.