AP: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో భేటీ అయ్యారు. టౌన్‌ప్లానింగ్ అప్రూవల్ సిస్టమ్‌పై అధ్యయనానికి 20 రాష్ట్రాలకు అధికారులను పంపించామన్నారు. భవన నిర్మాణాలకు సులభంగా అనుమతుల ఇచ్చేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌శాఖలో నూతన విధానాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.