న్యాయవ్యవస్థ చేయాల్సిన పనిని ప్రతిపక్షాలు చేస్తున్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. న్యాయ వ్యవస్థ చట్టాలను పరిశీలిస్తుందని, ప్రతిపక్ష పాత్ర పోషించదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభల్లో అది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రజలు అనుకోకూడదని తెలిపారు.