TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సేపు మెలుకువలోనే ఉంటున్నాడని, కాకపోతే కుటుంబ సభ్యులను బాలుడు గుర్తించలేకపోతున్నట్లు వెల్లడించారు. శ్రీతేజ పూర్తిగా కోలుకునేందుకు మరికొంత కాలం పట్టొచ్చిని వైద్యులు అంటున్నారు.