మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులు, మహిళలు, యువతకు బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. విద్యార్థులకు నెలకు రూ.10 వేలు, మహిళలకు నెలకు రూ.2100, ఆశా వర్కర్లకు రూ.15 వేలు ఇస్తామని తెలిపింది. అలాగే, 25 వేల మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది. 5 ఏళ్లలో 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొంది.