AP: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే సభకు వెళ్లబోనని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరు కానున్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉండడంతో పాటు అక్కడ సంఖ్యాబలం పరంగా ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.