పియర్స్ పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్‌తోపాటు విటమిన్లు మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లను తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. పియర్స్ పండ్లలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్లు ఉంటాయి. ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తాయి. ఈ పండ్లు తింటే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.