ఇస్లామాబాద్ నిరసనపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్యకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. గత వారం ఇస్లామాబాద్‌లో ఆయన పార్టీ పీటీఐ మద్దతుదారులు చేసిన నిరసనలకు సంబంధించిన కేసులో పాకిస్తాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన నిరసనలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిలో 12 మంది PTI మద్దతుదారులు మరణించగా.. వందల మందిని అరెస్టు చేశారు.