AP: ఏలూరులో బాణసంచా పేలి ఒకరు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో బాణసంచా పేలింది. బాణసంచా తీసుకెళ్తుండగా రెండ్ బైక్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక్కసారిగా బాణసంచా పేలి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.