TG: జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేందర్ ఇళ్లలో జరిపిన తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ఆయనను ప్రశ్నించారు. ఈ మేరకు వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు.