AP: ఈనెల 24, 25వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో జరిగిన సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలపై పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచిన 4 నెలల్లో ప్రభుత్వ శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.